కరువు తీరా వర్షం.. రైతుల హర్షం!

అనంతపురం జిల్లాలో వరదలు.. ఈమాట వినడానికే చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అనంతపురం జిల్లాకు వరదలు వస్తాయని గత కొన్ని దశాబ్ధాలుగా ఆ ప్రాంత ప్రజలు బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో! వరద అనేది…

అనంతపురం జిల్లాలో వరదలు.. ఈమాట వినడానికే చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అనంతపురం జిల్లాకు వరదలు వస్తాయని గత కొన్ని దశాబ్ధాలుగా ఆ ప్రాంత ప్రజలు బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో! వరద అనేది చాలామందిని భయపెట్టే పదమే అయినా.. అనంతపురం జిల్లా వాసులు మాత్రం సంభ్రమాశ్చర్యలతో ఎంతో ఆనందంగా వరదలను, వర్షాలను ఆస్వాధిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో పశ్చిమ కనుమలు, మహాభలేశ్వర్‌ పర్వతాల్లో కురిసిన వర్షాలు కృష్ణమ్మగా పరగులెత్తాయి.

అలాంటి వర్షాలతో ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి ఎంతోకొంత నీటిలభ్యత చోటు చేసుకుంది. ఎంతైనా వర్షాలు పడితే లభించే నీళ్లకు ప్రాజెక్టులతో వచ్చే నీళ్లకు బోలెడంత తేడా ఉంటుంది. వర్షపాతం మాత్రం లోటే అనిపించుకుంది. అయితే ఆ లోటు తీరా సెప్టెంబర్‌లో వర్షాలు కురిశాయి. సెప్టెంబర్‌ పదిహేను తర్వాత భారీవర్షాలు చోటు చేసుకున్నాయి.

ముందుగా కర్నూలు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. అక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. కర్నూలును అడపాదడపా అలాంటి వర్షాలు పలకరిస్తూనే ఉంటాయి. నంద్యాల ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయి. అటవీ ప్రాంతంతో భారీవర్షాలు పడటంతో.. మహానంది ఆలయం కోనేరులో నీరు పొంగిపొర్లాయి. ఆలయం ప్రధాన ద్వారం నుంచి కూడా భారీగా నీళ్లు బయటకు వచ్చాయి.

అక్కడితో మొదలు.. రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడం మొదలైంది. కర్నూలుతో పాటు చిత్తూరు కూడా అదేదశలో తడిసి ముద్దైంది. ఆ తర్వాత కడప వంతు వచ్చింది. తర్వాత అనంతపురం కూడా లోటును భర్తీ చేసుకుంది.

అనంతపురం జిల్లాలో దాదాపు దశాబ్ధకాలంగా కూడా నీరు మొహమెరగని వంకలు ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నాయి. అనేక చెరువులు మరవలుపోయాయి. ఈ ఆనందాన్ని అక్కడి వాళ్లు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. ఇక వర్షాలు పడటం కలలోనేమో అనే భావనలో మునిగిపోయిన ప్రజలను ఈ వర్షాలు తడిచి ముద్దయ్యేలా చేశాయి.

కొన్ని చెరువులకు గట్లు తెగి ఊళ్ల మీదకు నీళ్లు వచ్చాయి. అలాంటి సంఘటనలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఏతావాతా భారీ స్థాయిలో కురిసిన వర్షాలు రాయలసీమ ప్రాంతాన్ని అమితంగా సంతోష పెడుతూ ఉన్నాయి. చెరువుల్లోకి నీరు రావడంతో.. భూగర్భ జలాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది రైతులను అమితంగా ఆనందపెడుతున్న అంశం.

బావుల్లో, బోర్లలో నీళ్లు ఉంటే.. రాయలసీమ ప్రాంతానికి ఇక ఏమీ అక్కర్లేదు. అంతా ఉన్న సారవంతమైన భూముల్లో బంగారం పండుతుంది నీళ్లు ఒక్కటీ ఉంటే. దీంతో ఈ ఏడాది భారీగా పంటలు సాగు అయ్యే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌లో సాగైన వేరుశనగ కూడా ఈ వర్షాలతో రైతులకు దిగుబడిని ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఈసారి రాయలసీమకు గరిష్ట స్థాయిలో నీరు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా ఈసారి చెరువులను  భారీగా నింపడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇది రైతులను మురిపిస్తూ ఉన్న అంశం.

ఏతావాతా జగన్‌ ముఖ్యమంత్రి అయిన వేళా విశేషం అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. పదేళ్లలో ఎన్నడూ పారని వంకలు, ఎన్నడూ నిండని చెరువులు కూడా నిండేసరికి వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రభుత్వం మారిన సంవత్సరం భారీ వర్షాలు కురవడం.. జగన్‌పై రైతుల్లో ఉన్న పాజిటివ్‌ ఫీలింగ్‌ మరింత పెరుగుతూ ఉంది!

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి