ఇటు కార్తికేయ.. అటు సీతారామం.. డబుల్ ధమాకా

ఒకే నెలలో థియేటర్లలోకి వచ్చాయి సీతారామం, కార్తికేయ-2 సినిమాలు. రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకే రోజు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఆశ్చర్యకరంగా బుల్లితెరపై కూడా ఈ రెండూ మంచి విజయాన్నందుకున్నాయి. Advertisement…

ఒకే నెలలో థియేటర్లలోకి వచ్చాయి సీతారామం, కార్తికేయ-2 సినిమాలు. రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకే రోజు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఆశ్చర్యకరంగా బుల్లితెరపై కూడా ఈ రెండూ మంచి విజయాన్నందుకున్నాయి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది సీతారామం సినిమా. దుల్కర్ హీరోగా నటించిన ఈ సినిమాకు 8.73 టీఆర్పీ వచ్చింది. స్టార్ ఎట్రాక్షన్ లేని ఈ సినిమాకు ఈ నంబర్, పెద్ద రేటింగ్ కింద లెక్క.

ఇక జీ తెలుగు ఛానెల్ లో అదే టైమ్ లో కార్తికేయ-2ను ప్రసారం చేశారు. ఈ సినిమాకు 7.88 టీఆర్పీ వచ్చింది. ఇది కూడా చాలా మంచి రేటింగ్. ఈ సినిమాతో నిఖిల్ ఎలాగైతే పాన్ ఇండియా లెవెల్లో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడో, ఇటు స్మాల్ స్క్రీన్ పై కూడా కెరీర్ బెస్ట్ టీఆర్పీ అందుకున్నాడు.

ఇలా ఒకేసారి 2 ఛానెళ్లలో ప్రసారమైన సీతారామం, కార్తికేయ2 సినిమాలు రెండూ టీవీల్లో హిట్టయ్యాయి. ఈమధ్య కాలంలో వెండితెరపై హిట్టయిన సినిమాలు బుల్లితెరపై పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. ఆ నెగెటివ్ సెంటిమెంట్ ను ఈ 2 సినిమాలు తిప్పికొట్టాయి.