‘వాల్మీకి’ నిర్మాతలకు జీఎస్టీ గండం?

వాల్మీకి/గద్దలకొండ గణేష్ సినిమా విడుదలై వన్ వీక్ పూర్తయింది. సినిమాకు రకరకాల రేటింగ్ లు వచ్చాయి. మాంచి టాక్ వచ్చింది. మెగాభిమనులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే నిర్మాతలు మాత్రం జస్ట్ ఊపిరి పీల్చుకున్నారు.…

వాల్మీకి/గద్దలకొండ గణేష్ సినిమా విడుదలై వన్ వీక్ పూర్తయింది. సినిమాకు రకరకాల రేటింగ్ లు వచ్చాయి. మాంచి టాక్ వచ్చింది. మెగాభిమనులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే నిర్మాతలు మాత్రం జస్ట్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల. ఖర్చుకు, అమ్మకాలకు మధ్య చాలా అంటే చాలా నామినల్ మార్జిన్ వుండడం వల్ల. అయితేనేం, ఓ హిట్ సినిమా తీసాం అనిపించుకున్నట్లే అనుకున్నారు.

ఆ సంతోషంతోనే కలెక్షన్లు నిలబెట్టడానికి రెండు రాష్ట్రాల టూర్ కూడా పెట్టుకున్నారు. మళ్లీ అదో అదనపు భారం అని తెలిసినా, తప్పదు కనుక టూర్, విశాఖలో సక్సెస్ మీట్ ప్లాన్ చేసారు. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూసిన తరువాత ఇంకా బ్రేక్ ఈవెన్ సమస్య చాలామంది బయ్యర్లను వెంటాడుతోంది అన్నది క్లియర్ అయింది. సెకెండ్ వీకెండ్ కు మిగిలినవారు కూడా చాలావరకు బ్రేక్ ఈవెన్ అవుతారేమో? అన్న ఆశ వుంది.

కానీ ఇక్కడ సమస్య అదికాదు. ఈ మధ్య టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలయింది. కొన్న బయ్యర్ కు లాభాలు వస్తే జీఎస్టీ కడుతున్నారు. లాభం రాకపోతే, నిర్మాతనే జీఎస్టీ కడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వాల్మీకి/గద్దలకొండ గణేష్ బయ్యర్లకు జీఎస్టీని నిర్మాతలు చెల్లించాల్సి రావచ్చు అని ట్రేడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అదే జరిగితే ఈ సినిమా నిర్మాతలు నష్టమే మిగులుస్తుంది.

తొలివారం కలెక్షన్లు ఇలా వున్నాయి
నైజాం……………….6.15 కోట్లు
సీడెడ్………………..2.80
ఉత్తరాంధ్ర………….2.10
ఈస్ట్…………………..1.25
వెస్ట్……………………1.22
కృష్ణా…………………..1.28
గుంటూరు…………….1.50
నెల్లూరు……………….0.73

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ