‘మా’ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. మంచు విష్ణు ధీమా

ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉంటుందంటున్నాడు మంచు విష్ణు. చాలామంది తన వ్యతిరేక ప్యానెల్, అపొజిషన్ కాంపౌండ్ లో ఉన్నప్పటికీ.. ఆ ఓట్లు కూడా తనకే పడతాయని చెబుతుతన్నాడు. అసోసియేషన్…

ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉంటుందంటున్నాడు మంచు విష్ణు. చాలామంది తన వ్యతిరేక ప్యానెల్, అపొజిషన్ కాంపౌండ్ లో ఉన్నప్పటికీ.. ఆ ఓట్లు కూడా తనకే పడతాయని చెబుతుతన్నాడు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఆల్రెడీ నామినేషన్ వేసిన మంచు విష్ణు.. తన విజయం  మొత్తం క్రాస్ ఓటింగ్ పైనే ఆధారపడి ఉందంటున్నాడు.

“చాలామంది నాతో నిజాయితీగా మాట్లాడారు. వృత్తిపరంగా వేరే కాంపౌండ్ లో ఉండాల్సి వచ్చింది. కానీ ఓటుు మాత్రం కచ్చితంగా నీకే వేస్తాం అన్నారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగబోతోంది. పూర్తిగా నాకు అనుకూలంగా ఉండబోతోంది. అవతల కాంపౌండ్ వ్యక్తులు అనుకునేవాళ్లు కూడా నాకే ఓటు వేయబోతున్నారు.”

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నానని ప్రకటించాడు మంచు విష్ణు. నిజంగా ఇంతే సీరియస్ గా వర్క్ చేసినట్టయితే.. జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యేవాడినని జోక్ చేశారు.

“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 900 మందికి పైగా సభ్యులున్నారు. వీళ్లలో 778 మందితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. మిగతా వాళ్లు కొంతమంది అందుబాటులోకి రాలేదు. నేను ఈ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. చాలామంది నాతో చెబుతున్నారు, ఇంతే సీరియస్ గా తీసుకుంటే బహుశా నేను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గెలుస్తానేమో. కానీ రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. రాజకీయాల్లోకి వెళ్లడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవిని ఎంట్రీగా నేను భావించడం లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల్ని కూడా లాగుతున్నారు. అది నాకు ఇష్టం లేదు.”

ప్రకాష్ రాజ్ తరపున కొన్ని రాజకీయ పార్టీలు అసోసియేషన్ ఎన్నికల్లోకి ప్రవేశించాయని ఆరోపించారు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ తరఫున కొంతమంది రాజకీయ నేతలు సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని.. అసోసియేషన్ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు రావడం కరెక్ట్ కాదన్నారు. కొంతమంది రాజకీయ నాయకులతో తను పర్సనల్ గా మాట్లాడానని, అసోసియేషన్ ఎన్నికల్లో కొంతమంది లీడర్స్ వర్క్ చేస్తున్నారనే విషయాన్ని వాళ్లు తనకు చెప్పారని అన్నాడు.