తను ఉదయం లేస్తే పోర్న్ చూస్తాను అంటూ చెప్పుకున్న వ్యక్తి గురించి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? మిమ్మల్ని వేరే గ్రహానికి పంపేస్తే వెంట ఏం తీసుకెళ్తారు? అనే ప్రశ్నకు గాడ్ ఫాదరూ, నాలుగు బ్లూ ఫిల్మ్ లు అంటూ ఓపెన్ గా చెప్పిన వ్యక్తి ని కొత్తగా పోర్్న చూసే వ్యక్తిగా చిత్రీకరించడానికి ఏముంది? కేవలం పోర్్న చూడటం గురించినే కాదు, తన సర్వ అవలక్షణాల గురించి కూడా వర్మ చెబుతూనే ఉంటాడు. పది, పన్నెండేళ్ల కిందట దేశంలో బ్లాగుల విప్లవం వచ్చినప్పటి నుంచి ఆర్జీవీ సోషల్ మీడియాలో తన అవలక్షణాల గురించినే చెబుతున్నాడు.
తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ బిల్డింగ్ పనులు చేసేందుకు వచ్చే ఒక అమ్మాయిని బుల్లెట్ అని పిలుచుకునేవాళ్లమని ఆమె ఎంత సెక్సీగా ఉంటుందో వర్ణిస్తూ ఒక పోస్టు సైతం రాసి తన టేస్టేమిటో వర్మ తనే చెప్పుకున్నాడు. చాలా మందిలో ఈ మనస్తత్వం ఉంటుంది. అయితే దాన్ని బయటకు చెప్పుకునే ధైర్యం మాత్రం 99 శాతం మందికీ ఉండదు! అలా చెప్పుకున్న వర్మ గురించి ఇంకా చెడ్డగా తీయడానికేం మిగిలింది!
యాక్షన్ కు రియాక్షన్ గా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్మ మీద వరసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మరి వారికి మెటేరియల్ ఏమిటి? అంటే.. వర్మ బయోగ్రఫీల్లాంటి రెండు పుస్తకాలున్నట్టున్నాయి. తెలుగులో 'సాక్షి' వాళ్లు ప్రచురించిన ఆర్జీవీ బ్లాగ్ పోస్టులు ఆ తర్వాత పుస్తకంగా వచ్చాయి. వాటి నిండా వర్మ అష్టావక్రుడిలా రెచ్చిపోయారు. అదే సమయంలో గొప్ప గొప్ప తత్వవేత్తలనూ టచ్ చేశాడు. వర్మలోని ఆ కోణం వర్మను విమర్శించే వాళ్లకు అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది వర్మలోని వక్రకోణమే కాబట్టి.. దాని కోసం వర్మ రాతలనే ఆధారంగా చేసుకోవచ్చు. విషయం లేకున్నా.. వర్మ తీసే సినిమాలను చూసి కొంతమంది గిలగిల్లాడుతూ ఉన్నారు. వీళ్లు వర్మ మీద కౌంటర్ సినిమా తీస్తే, వర్మ వీళ్లలా గిజగిజలాడకపోవచ్చు.