షాకింగ్.. అంబటి రాంబాబుకు కరోనా

వైసీపీలో మరో నేతకు కరోనా సోకింది. పార్టీలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్న అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని అంబటి స్వయంగా వెల్లడించారు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే…

వైసీపీలో మరో నేతకు కరోనా సోకింది. పార్టీలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్న అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని అంబటి స్వయంగా వెల్లడించారు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.

“నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు కానీ నేను వాటిని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఐసొలేషన్ లో ఉన్నాను. ఓ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ధైర్యంగా ఉన్నాను. ఈరోజు ఉదయం కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. నేను ఆరోగ్యంతో బయటకొస్తాను. ఎవరూ ఆందోళన చెందకండి.”

చాలామంది అంబటి రాంబాబుకు కాల్స్ చేస్తున్నారు. అందరి ఫోన్లు ఆన్సర్ చేసి సమాధానం చెప్పడం కంటే వీడియో రిలీజ్ చేయడం బెటరనే ఉద్దేశంతో కొద్దిసేపటి కిందట అంబటి వీడియో రిలీజ్ చేశారు.

మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ