వనిత మూడో పెళ్లి.. నయనతారకు చుట్టుకుంది

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ ఈమధ్య మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. గ్రాఫిక్ డిజైనర్ పీటర్ పాల్ ను ఆమె పెళ్లి…

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ ఈమధ్య మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. గ్రాఫిక్ డిజైనర్ పీటర్ పాల్ ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే పీటర్ పాల్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడు.

ఇక అప్పట్నుంచి వనిత హాట్ టాపిక్ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, లైవ్ లో చర్చలు, పోలీస్ కంప్లయింట్స్.. ఇలా ఒకటి కాదు… ప్రతి రోజూ ఆమె వార్త లేనిదే కోలీవుడ్ మీడియాకు నిద్రపట్టడం లేదు. అయితే ఊహించని విధంగా ఈ వివాదంలోకి నయనతార ఇష్యూ రావడంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

తనపై దాడి చేస్తున్న వాళ్లను ఉద్దేశించి వనిత కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేసింది. ఆ ట్వీట్స్ లోకి నయనతారను లాగింది. ప్రభుదేవా-నయనతార సహజీవనం చేసుకున్నారు కదా అని ప్రశ్నించింది. ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయనతారతో పెళ్లికి రెడీ అయ్యాడంటూ ట్వీటింది. అక్కడితో ఆగకుండా ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు పడిన కష్టాల్ని ఏకరవు పెట్టింది.

ఇలా ఊహించని విధంగా వనిత వివాదంలోకి నయనతార రావడంతో ఆమె ఫ్యాన్స్ భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో వనితను గట్టిగా తగులుకున్నారు. ఆ ప్రభావం ఎంత గట్టిగా పడిందంటే.. ప్రస్తుతం వనిత తన పోస్టులన్నీ డిలీట్ చేసి, ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేసేసింది.

ఓవైపు నయనతార, విఘ్నేష్ పెళ్లికి రెడీ అవుతుంటే.. వనతి ఇలా పాత గాయాన్ని కెలికి నయనతారను మరోసారి మనోవేదనకు గురిచేసింది.

ఆర్జీవీ చాలా తెలివైనోడు

మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ