హెవీ డైలాగ్స్.. హెవీ యాక్షన్

గంభీరమైన వాయిస్ తో, మంచి నటన ప్రదర్శంచగలిగిన యంగ్ హీరో సత్యదేవ్. కానీ సరైన కెరీర్ టర్నింగ్ ఇచ్చుకునే రేంజ్ సినిమా పడడం లేదు. మంచి సినిమాలు చేస్తున్నాడు అని పేరు వస్తోంది తప్ప,…

గంభీరమైన వాయిస్ తో, మంచి నటన ప్రదర్శంచగలిగిన యంగ్ హీరో సత్యదేవ్. కానీ సరైన కెరీర్ టర్నింగ్ ఇచ్చుకునే రేంజ్ సినిమా పడడం లేదు. మంచి సినిమాలు చేస్తున్నాడు అని పేరు వస్తోంది తప్ప, కెరీర్ సర్రున పైకి లేచే రేంజ్ రావడం లేదు. 

ఇలాంటి నేపథ్యంలో చేస్తున్న మరో ప్రయత్నం గాడ్సే. వర్తమాన రాజకీయాలపై తూటాల్లాటి మాటలు, వాటికి తీసిపోని బుల్లెట్ల వర్షం కురిపించే యాక్షన్ సన్నివేశాలు మిక్స్ చేసిన గాడ్సే ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ ఎమోషన్ జానర్ లోనే సాగింది.

సత్య ఎగ్రెసివ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగులు అన్నీ కలిసి ట్రయిలర్ ను ఆకట్టుకునేలా చేసాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించిన గోపీ గణేష్ పట్టాభి రాసిన డైలాగులు బలంగా, ఆలోచింపచేసేలా వున్నాయి. 

గతంలో సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ ను అందించింది ఇతగాడే. ఆ సినిమాలో కూడా ఆలోచింపచేసే డైలాగులు బోలెడు వుంటాయి.  ఇక్కడ కూడా అదే భావజాలం, పదును కనిపించింది.

సి కళ్యాణ్ నిర్మించే ఈ సినిమాకు సంగీతం శాండీ అద్దంకి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.