జగన్ని నమ్ముతున్నారు కాబట్టే..!

విశాఖ సహా ఉత్తరాంధ్రా  ప్రజలు ఎంత శాంతికాముకులో అంతకు అంత పోరాటయోధులు, ఇది ఉద్యమాల పురిటిగడ్డ. ఇక్కడ నుంచి అభ్యుదయం, విప్లవం రెండూ కలసి నడచి మిగిలిన ప్రపంచానికి దారిచూపాయి. Advertisement అటువంటి ప్రాంతం…

విశాఖ సహా ఉత్తరాంధ్రా  ప్రజలు ఎంత శాంతికాముకులో అంతకు అంత పోరాటయోధులు, ఇది ఉద్యమాల పురిటిగడ్డ. ఇక్కడ నుంచి అభ్యుదయం, విప్లవం రెండూ కలసి నడచి మిగిలిన ప్రపంచానికి దారిచూపాయి.

అటువంటి ప్రాంతం గురించి విపక్ష పార్టీలు కానీ ఇతరులు కానీ చులకనగా మాట్లాడితే సహించేది లేదని అంటున్నారు అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. విశాఖ వాసులంతా పరిపాలనారాజధానిని స్వాగతిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఎవరూ రాజధాని కోరుకోవడం లేదని టీడీపీ సహా ఇతర నాయకులు చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుపట్టారు. జగన్ మాట ఇస్తే తప్పడని, అందుకే అంతా ఆయన్ని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టే నెమ్మదిగా ఉన్నారని కూడా యార్లగడ్డ  విశ్లేషించారు.

విశాఖ రాజధాని కావడం పట్ల యువత, మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు అంతా కలసి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అమరావతిని పక్కన పెట్టి విశాఖను రాజధాని చేయడంలేదని, అధికార వికేంద్రీకరణలో భాగంగానే పాలనా రాజధానిగా జగన్ చేస్తున్నారన్నది అంతా గుర్తు పెట్టుకోవాలని కూడా యార్లగడ్డ హితవు పలికారు.

విశాఖ రాజధాని వద్దు అనుకున్నవారు అమరావతి శాసన రాజధానిలో ఉండిపోవచ్చునని కూడా ఆయన సూచించారు. మొత్తానికి విశాఖ‌ రాజధాని గురించి అవాకులు చవాకులు పేలుతున్న వారికి యార్లగడ్డ మాస్టార్ తనదైన బెత్తం దెబ్బల్లాంటి మాటలతో బాగానే పాఠాలు చెప్పారనుకోవాలి.

ఆర్జీవీ పవర్ స్టార్ స్పెషల్ ఇంటర్వ్యూ