బెదురులంక 2012..ప్రీ లుక్

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా తయారవుతున్న చిత్రం 'బెదురులంక 2012'. తాజాగా వినూత్నమైన ప్రీ-లుక్ ని ఈ చిత్రం నుంచి విడుదల చేసారు.…

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా తయారవుతున్న చిత్రం 'బెదురులంక 2012'. తాజాగా వినూత్నమైన ప్రీ-లుక్ ని ఈ చిత్రం నుంచి విడుదల చేసారు. ఈ నెల 30న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. 

కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర తో పాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలందించగా, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషంఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన తారాగణం. నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.