సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నది సామెత. వాల్తేర్ వీరయ్య… వీరసింహారెడ్డి సినిమాలు ఒకేసారి తయారు చేయాల్సి రావడం, ఒకేసారి విడుదల చేయాల్సి రావడం అన్నది మైత్రీ మూవీస్ అధినేతలకు తలకాయనొప్పిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
టర్కీ షూటింగ్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని విషయంలో హీరో బాలయ్య చిర్రుబుర్రులాడారని వార్తలు వినిపించాయి. ఆ తరువాత అవన్నీ సర్దు మణిగాయి.
లేటెస్ట్ గా నిన్నటికి నిన్న లోకేషన్ లో కాస్ట్యూమ్ వర్కర్ పై బాలయ్య చిందులు తొక్కారని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు లోకేషన్ లో వుండడం లేదని, ఆ కోపం అలా అలా బాలయ్య ఓ వర్కర్ మీద చూపించారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిర్మాత వస్తే అతనిపై కూడా బాలయ్య కాస్త పరుషంగా మాట్లాడారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దీంతో ఈ రోఙు ఆ వర్కర్ సెట్ కే రాలేదని తెలుస్తోంది. సరదగా వుంటే బాలయ్య చిన్న పిల్లాడే. కానీ తేడా వస్తే మాత్రం రుద్రుడిగా మారిపోయి తాండవం చేసేస్తారు. ఆ మూడ్ స్వింగ్ ను కనిపెట్టడమే కాస్త కష్టం.