సైరా.. ఇది కదా కావాల్సింది

మూడు నిమిషాల ట్రయిలర్ వచ్చి వారంరోజులు తిరగకుండానే మరో ట్రయిలర్ వచ్చింది సైరా యూనిట్ నుంచి. బాలీవుడ్ జనాలకు యాక్షన్ కంటెంట్ వుంటే లైక్ చేస్తారనే అభిప్రాయంతో ఆ తరహా ట్రయిలర్ కట్ చేసి…

మూడు నిమిషాల ట్రయిలర్ వచ్చి వారంరోజులు తిరగకుండానే మరో ట్రయిలర్ వచ్చింది సైరా యూనిట్ నుంచి. బాలీవుడ్ జనాలకు యాక్షన్ కంటెంట్ వుంటే లైక్ చేస్తారనే అభిప్రాయంతో ఆ తరహా ట్రయిలర్ కట్ చేసి వదిలారు. యాభై ఎనిమిది సెకెండ్ల ఈ ట్రయిలర్ కు మాంచి అప్లాజ్ వస్తోంది. సిజి షాట్లు, యాక్షన్ సీక్వెన్స్, అందులో వున్న ఒకటి రెండు డైలాగులు ఇలా ప్రతి ఒక్కటీ సూపర్ అంటే సూపర్ అన్న టాక్ వచ్చింది.

ఇందులోని నైట్ ఎఫెక్ట్ పడవల షాట్లు, ఆ క్లయిమాక్స్ డైలాగ్ లు, ముందు విడుదల చేసిన ట్రయిలర్ లో వేసి వుండొచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. ఏమయితేనేం, సైరాకు ఇప్పటికే వచ్చిన బజ్ ను మరింత పెంచేలా చేసింది ఈ రెండో ట్రయిలర్.

బాలీవుడ్ లో సైరాకు పోటీగా విడుదలవుతున్న వార్ సినిమాకు దీటుగా ఇందులో కూడా యాక్షన్, సిజి ఎపిసోడ్ లు వున్నాయని ప్రూవ్ చేయడానికి, చెప్పడానికి టార్గెట్ గా ఈ రెండో ట్రయిలర్ ను విడుదల చేసినట్లయితే, ఆ లక్ష్యం నెరవేరినట్లే. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ రెండో ట్రయిలర్ తో మరింత ఖుషీ అవుతున్నారు.