భారీ స్టార్ కాస్ట్, ఇంటర్నేషనల్ పేరున్న డైరక్టర్. అయినా సమ్మర్..సంక్రాంతి కావాలి. మరే సినిమా పోటీ వుండకూడదు. ఇవే ఆలోచనలు. ఆర్ఆర్ఆర్ సంగతే ఇదంతా. కచ్చితంగా దసరాకే వస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు.
ఇప్పుడు ఉరుము లేని పిడుగులా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాం అని ఫీలర్లు వదులుతున్నారు. దాంతో సంక్రాంతి బరిలో ఇప్పటికే దిగాలనుకుంటున్న సినిమాలు కిందా మీదా అవుతున్నాయి.
మహేష్ బాబు సర్కారు వారి పాట సంక్రాంతి బరిలో వుండకపోవచ్చని వినిపిస్తోంది. బంగార్రాజు ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలి. జీ సంస్థతో అగ్రిమెంట్ లోనే ఆ పాయింట్ వుంది.
భీమ్లానాయక్, రాథేశ్వామ్ లు రెండూ ఆర్ఆర్ఆర్ ను ఢీకొంటాయో, తప్పుకుంటాయో అన్న అనుమానాలు వున్నాయి. భీమ్లానాయక్ సంగతి తెలియదు కానీ రాదేశ్యామ్ మాత్రం ఆరు నూరయినా జనవరి లో సంక్రాంతికి విడుదలవుతుందని యూనిట్ బలంగా ప్రకటించింది.
అంటే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సోలో గా దిగలేదని స్పష్టం అవుతోంది. మరి రాధేశ్యామ్ ఇంత స్పష్టంగా ప్రకటించిన తరువాత ఆర్ఆర్ఆర్ ఏం చేస్తుందో చూడాలి.