విశాఖ విజయవాడ మరింత దగ్గరగా…

విశాఖకు విజయవాడకు దూరం కిలోమీటర్ల లెక్కన చూస్తే చాలా ఉంది. విమానం ద్వారా తప్పిస్తే రైలు ఇతర మార్గాల ద్వారా వెళ్తే ఆరు గంటలు తక్కువ సమయం పట్టదు. బస్సులు అయితే ఏకంగా ఎనిమిది…

విశాఖకు విజయవాడకు దూరం కిలోమీటర్ల లెక్కన చూస్తే చాలా ఉంది. విమానం ద్వారా తప్పిస్తే రైలు ఇతర మార్గాల ద్వారా వెళ్తే ఆరు గంటలు తక్కువ సమయం పట్టదు. బస్సులు అయితే ఏకంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల టైం తీసుకుంటుంది.

అలాంటిది వందేభారత్ సెమీ హై స్పీడ్ రైలు తో ఈ దూరాన్ని సగానికి సగం తగ్గించే పనిలో రైల్వే శాఖ పడింది. విశాఖ నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల కాలంలో చేరే విధంగా వందేభారత్ రైలు స్పీడ్ చేయనుంది. వాల్తేరు డివిజన్ కి ఈ రైలుని రైల్వే శాఖ కేటాయించింది.

తొందరలోనే ఎనిమిది కోచ్ లతో ఈ రైలు ట్రయల్ రన్ ని నిర్వహిస్తున్నారు. మొదట విజయవాడకు ఈ రైలు నడుపుతారు. సాధ్యమైనంత త్వరలో సికింద్రాబాద్ కి కూడా పొడిగిస్తారు. అలా విశాఖ హైదరాబాద్ ల మధ్యన కూడా ప్రయాణించే దూరం తగ్గిపోతుంది. 

విశాఖ నుంచి విజయవాడకు వెళ్ళే వారికి చైర్ కార్ కి 850 రూపాయలుగా ఉంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో 1650 రూపాయలు గా నిర్ణయించే అవకాశం ఉంది.