చంద్రముఖిలా మారిన చంద్రబాబు

14ఏళ్లు ముఖ్యమంత్రిగా అనుభవం, ప్రతిపక్ష నేతగా నలుగురు ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేత ఎలా ఉండాలి. చంద్రబాబు ఎలా ఉంటున్నారు. ఆయన భాష, ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఎవరికైనా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అవును,…

14ఏళ్లు ముఖ్యమంత్రిగా అనుభవం, ప్రతిపక్ష నేతగా నలుగురు ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేత ఎలా ఉండాలి. చంద్రబాబు ఎలా ఉంటున్నారు. ఆయన భాష, ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఎవరికైనా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అవును, చంద్రబాబు మారిపోయారు. టీడీపీ చరిత్రలోనే దారుణ పరాభవం చవిచూసిన తర్వాత బాబులో మార్పు మొదలైంది. ఆయన మీడియా ముందు మాట్లాడే భాష, హావభావాల్లో మార్పు స్పష్టమవుతోంది.

ఇక చినబాబుని చూసి సోషల్ మీడియాలో మరీ లేకిగా పోస్టింగ్ లు పెడుతున్నారు చంద్రబాబు. నీతిమాలిన పనులు, గడ్డి తినడం, తోలుబొమ్మలాట, కేతిగాళ్లు.. ఇవీ చంద్రబాబు ట్విట్టర్లో వాడుతున్న పదాలు. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు, పోస్టింగ్ ల్లో కూడా ఇలాంటి వాటికి చోటిచ్చేవారు కాదు. ఆవేశం వచ్చినా, ఆగ్రహం వచ్చినా కాస్త కంట్రోల్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా కట్టుతప్పుతున్నారు. బిహేవియర్ మాత్రమే కాదు, భాష కూడా మారిపోయింది.

ఎన్నికల్లో పరాభవ భారమో లేక, అధికారంలోకి వచ్చాక జగన్ కు మరింతగా పెరుగుతున్న ప్రజాదరణో.. కారణం ఏదైనా చంద్రబాబు మాత్రం ఇప్పుడు ఫ్రస్టేషన్ కి కేరాఫ్ గా మారిపోయారు. సహజంగా పార్టీల అధినేతలు తమ పర్సనల్ అకౌంట్ల నుంచి కాస్త హుందాగా ట్వీట్ చేస్తుంటారు, పార్టీ అఫిషియల్ అకౌంట్లు, అనుబంధ సంస్థల ఖాతాల నుంచి మాత్రం విమర్శలు శృతి మీరుతుంటాయి. లోకేష్ జమానా వచ్చాక, వెబ్ న్యూస్ పోర్టల్ ల క్లిప్పింగ్ లు జతచేసి మరీ ట్వీట్లు పడుతున్నాయి.

ఇప్పటివరకూ చంద్రబాబు అలాంటి ప్రయోగాలు జోలికెళ్లలేదు. ఇప్పుడు ఆయన కూడా వెబ్ సైట్ స్క్రీన్ షాట్లు తీసి ఆ వార్తలపై స్పందించండి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి మరీ ఇలా దిగజారుతారని, అధికారపక్ష నేతల్ని అనరాని మాటలతో సంబోధిస్తారని ఎవరూ ఊహించలేదు. చివరకు ఆ స్థాయికి కూడా దిగజారిపోయారు చంద్రబాబు. బాబు దిగజారడానికి ఇంతకంటే ఇంకేం లేదేమో.

సైరాపై డైరెక్టర్ అంచనాలేంటి..?