సూపర్ స్టార్ కృష్ణ మరణించి రోజులు గడచిపోతున్నాయి. పెద్ద కర్మ ను కొడుకు మహేష్ బాబు సంప్రదాయ బద్దంగా, ఘనమైన నివాళిగా నిర్వహించారు. ఇందుకోసం రెండు కోట్లకు పైగా ఖర్చు చేసారు.
జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో నాలుగు నుంచి అయిదు వేల లోపులో అభిమానులు, జనరల్ పబ్లిక్ కు భోజనాలు పెట్టారు. రెండు మాంసాహార వంటకాలు, మిగిలిన శాకాహార వంటకాలను జేఆర్సీ ఫంక్షన్ హాలు వారే తయారు చేసారు. అభిమానులతో పాటు సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ జనాలు కూడా ఇక్కడకు వచ్చారు.
సినిమా సెలబ్రిటీలు, మీడియా కోసం ఎన్ కన్వెన్షన్ లో భోజనాలు ఏర్పాటు చేసారు. ఈ భోజనాలను జూబ్లీ హిల్స్ లోని ప్రఖ్యాత స్పైసి వెన్యూ రెస్టారెంట్ తయారు చేసింది. పలు రకాల నాన్ వెజ్ వంటకాలు సిద్దం చేసారు. హీరో వెంకటేష్ వచ్చారు. నరేష్, పవిత్రలతో పాటు నరేష్ మాజీ భార్య, పిల్లలు కూడా హాజరయ్యారు.
ఇంట్లో పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించాక ఇక్కడకు మహేష్ కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. మొత్తం ఖర్చు రెండు చోట్లకు కలిపి రెండు కోట్లకు పైగానే ఖర్చు అయిందని తెలుస్తోంది.