రామ్ చరణ్..ఏం జ‌రిగింది?

మొత్తానికి మైత్రీ సంస్థ అధినేతలకు సన్నిహితుడు, అదే సంస్థలో మైనర్ భాగస్వామి అయిన సతీష్ కిలారు ఫుల్ టైమ్ నిర్మాతగా మారుతున్నారు. ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు.…

మొత్తానికి మైత్రీ సంస్థ అధినేతలకు సన్నిహితుడు, అదే సంస్థలో మైనర్ భాగస్వామి అయిన సతీష్ కిలారు ఫుల్ టైమ్ నిర్మాతగా మారుతున్నారు. ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. ఈ వార్త ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ గా అందించాం. ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఈ బుధవారం వస్తోంది. 

ఉప్పెన బుచ్చిబాబు డైరక్ట్ కాబట్టి, అలాగే సుకుమార్ శిష్యుడు కాబట్టి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వుంటుంది. బట్ హోల్ అండ్ సోల్ నిర్మాత సతీష్ కిలారు నే. ఇక్కడే రకరకాల గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు మైత్రీకి మధ్యలో ఏం జ‌రిగింది? అసలు వాల్తేర్ వీరయ్య టైమ్ లో మెగాస్టార్ కు మైత్రీకి మధ్యలో ఏమైనా జ‌రిగిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఎందుకంటే మైత్రీ దగ్గర వున్న దర్శకుడు..మైత్రీ తీసుకెళ్లిన కథ అన్నది వాస్తవం. కానీ మైత్రీకి కాకుండా వేరే వాళ్లకు చేస్తా అని హీరో అన్నారు అని వార్తలు వినిపించడం, అలాగే వేరే బ్యానర్ ఫిక్స్ కావడం అన్నది ఈ అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా వుండగా ఈ పంచాయతీ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లగా, ఆయనే జ‌స్ట్ బ్యానర్ వరకు మైత్రీ సంస్థ పేరు కూడా కలపమని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే బుచ్చిబాబు గురువు కనుక సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా వుంటుంది. బట్.. సతీష్ కిలారునే సోలో ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ తో అనుకున్న కబడ్డీ, విజ‌యనగరం జిల్లా బ్యాక్ డ్రాప్ స్టోరీనే ఇప్పుడు రామ్ చరణ్ తో తీయబోతున్నారు.