వర్తమాన రాజకీయాలు…ప్రజాస్వామ్యం..ప్రజల తీరు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శాసనసభ. నోటుకు లొంగి ఓటు వేసే జనాలు. అలాంటి జనాలను చులకనగా చూసే పాలకులు. అధికారం కోసం వెంపర్లాడే రాజకీయ పక్షాలు..వీళ్లందరి మధ్య ఓ హీరో..ఇలాంటి సీన్లతో కట్ చేసి విడుదల చేసారు శాసనసభ ట్రయిలర్ ను. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్, హెబ్బా పటెల్ తదితరులు లీడ్ రోల్స్ లో కనిపించిన ట్రయిలర్ కు రవి బస్రూర్ నేపథ్య సంగీతం అట్రాక్షన్ గా వుంది.
విజువల్స్ బాగానే వున్నాయి. ఇలాంటి పొలిటికల్ సినిమాకు డైలాగులు కీలకం. రాఘవేంద్ర రెడ్డి అందించిన డైలాగులు అలాంటి లోటును పూడ్చేలాగే వున్నాయి. మంచి వాళ్లకు రాజకీయం పనికి రాదు. మదగజాల్లాంటి రాజకీయ నాయకుల మధ్య నలిగిపోవడం తప్ప జరిగేది ఒరిగేది ఏమీ వుండదు..అలాంటి టైమ్ లో బలమైన హీరో వుండడం, అతగాడిని దగ్గరకు తీయడానికి లేదా అణగదొక్కడానికి రాఙకీయ పార్టీలు ప్రయత్నించడం ఇలా అనేక సీన్లు ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి.
సప్ బ్రో గ్రూప్ నిర్మాణంలో తులసి రామ్..షణ్ముగం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాఘవేంద్ర రెడ్డి, వేణు మండికంటి దర్ళకుడు.