బాహుబలి ప్రభాస్ పక్కన బాలీవుడ్ నటి దీపిక పడుకొనె హీరోయిన్ గా ఎంపికయింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో అశ్వనీదత్ నిర్మించే ఈ సినిమా బడ్జెట్ లో ఇప్పుడు దీపిక రెమ్యూనిరేషన్ కూడా ఓ పార్ట్ నే. దాదాపు ముఫై కోట్లు అంటే అంతే కదా? దీపిక రెమ్యూనిరేషన్ 25 కోట్లు అంట. జీఎస్టీ కూడా నిర్మాతే భరించాలి. అంటే దగ్గర దగ్గర ముఫై కోట్లు.
అందుకే ఈ విషయంలో కూడా చిన్న చిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో వుంది దీపిక. మన వాళ్లకు ప్రభాస్ పక్కన దీపిక అంటే క్రేజ్ నే కానీ, బాలీవుడ్ లో ఇప్పుడు దీపిక కు మరీ అంత క్రేజ్ లేదు. అలాంటి హీరోయిన్ మీద 30 కోట్లు ఖర్చు పెట్టడమా అనే కామెంట్ లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే ప్రభాస్ కు ఎప్పటి నుంచో దీపిక తో నటించాలని కోరిక. అందుకే ప్రభాస్ కోసమే అశ్వనీదత్ ముఫై కోట్లకు తెగించి, దీపిక ను తన సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీపిక వుండడం వల్ల బాలీవుడ్ మార్కెట్ లో ఆ మేరకు డబ్బులు తెచ్చుసుకోవచ్చన్న ధీమా అయి వుంటుంది. అది కూడా వాస్తవమే బాలీవుడ్ లో నోటెట్ అయిన నటులు వుంటే అక్కడ మార్కెటింగ్ సులవు అవుతుంది. మంచి రేట్లు వస్తాయి కూడా. అందుకే ముఫై కోట్లకు తెగించి వుంటారు అనుకోవాలి.