సాయి తేజ్ అప్ డేట్ మరిచిపోయారా?

ఇరవై రోజులు అవుతోంది బైక్ యాక్సిడెంట్ కారణంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో చేరి. ఆరంభంలో మీడియా అతి ఎంత ఇబ్బందిగా వుందో, ఇప్పుడు ఆసుపత్రి నుంచి ఏ అప్ డేట్ లేకపోవడమూ…

ఇరవై రోజులు అవుతోంది బైక్ యాక్సిడెంట్ కారణంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో చేరి. ఆరంభంలో మీడియా అతి ఎంత ఇబ్బందిగా వుందో, ఇప్పుడు ఆసుపత్రి నుంచి ఏ అప్ డేట్ లేకపోవడమూ అంతే విడ్డూరంగా వుంది. 

అపోలో లాంటి టాప్ హాస్పిటల్, ఓ పాపులర్ హీరో ట్రీట్ మెంట్ జరుగుతుంటే అప్ డేట్ లు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా వుంది.

ఈ నెల 18న అపోలో నుంచి లాస్ట్ అప్ డేట్ వచ్చింది. అంటే పది రోజుల క్రితం. వెంటిలేటర్ తొలగించారు. స్వంతగానే శ్వాస తీసుకుంటున్నారు. స్పృహలోనే వున్నారు. మరి కొన్ని రోజులు ఆసుపత్రిలోనే వుంటారు. 

ఇదీ అప్ డేట్. కానీ ఆ మరికొన్ని రోజలు ఎన్ని అన్నవి తెలియదు. ఈ లోగా మామయ్య పవన్ కళ్యాణ్ గందరగోళం మాటలు. దాంతో మరింత అయోమయం.

ఇలాంటి నేపథ్యంలో ఆసుపత్రి నుంచి బులిటెన్ రాలేదు. ఇప్పుడు మీడియా వార్తలు రాస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ సుద్దులు చెబుతారు. ఇలాంటివి రాయాలి. ఏమిటో ఇదంతా.