లవ్ స్టోరీ కిస్ సీన్ ఫేక్

లవ్ స్టోరీ లో యూత్ జనాల గుండె పట్టుకుని ఒక్క క్షణం ఉయ్యాలూపిన సీన్ మెట్రో టైనులో కిస్ సీన్. చైతన్య-సాయిపల్లవి నడుమ తీసిన ఈ సీన్ లో చైతన్య ఫేస్ ఫీలింగ్స్ సూపర్…

లవ్ స్టోరీ లో యూత్ జనాల గుండె పట్టుకుని ఒక్క క్షణం ఉయ్యాలూపిన సీన్ మెట్రో టైనులో కిస్ సీన్. చైతన్య-సాయిపల్లవి నడుమ తీసిన ఈ సీన్ లో చైతన్య ఫేస్ ఫీలింగ్స్ సూపర్ అనిపించేసాయి. ఈ సీన్ గురించి సాయి పల్లవి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. 

కెమేరాలతో చేసిన చిన్న జిమ్మిక్ అది అని ఆమె వెల్లడించారు. తనకు కిస్ సీన్లు పెద్దగా ఇష్టం వుండదని, అందుకే శేఖర్ కమ్ముల దానికి తగినట్లు కెమేరాలు అటు ఇటు సెట్ చేసి, తాను కిస్ చేసినట్లు సీన్ తయారు చేసారని అన్నారు. 

తనకు నచ్చని, ఇబ్బందిపెట్టే సీన్ ఏదీ శేఖర్ కమ్ముల తీయరని, తన అభిప్రాయాలను గౌరవిస్తారని సాయి పల్లవి చెప్పారు. కానీ ఆ సీన్ అత్యంత సహజంగా వచ్చింది. దాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.

డ్యాన్స్ సీన్ లో గాల్లోకి ఎగిరి నేలకు వాలిన సీన్ లో తానే పైకి ఎగిరానని, అయితే కెమేరా వర్క్ తో బాగా పైకి ఎగిరినట్లు వచ్చిందని చెప్పారు. సినిమాలు ఎన్నాళ్లు సాగితే అన్నాళ్లు చేస్తానని, ఆ తరువాత మెడికల్ కెరీర్ లోకి వెళ్తానని వెల్లడించారు.