త‌నంత‌టి ల‌క్కీ గాల్ లేదంటున్న పెళ్లైన హీరోయిన్!

ఈ ప్ర‌పంచంలో త‌ను ల‌క్కీయెస్ట్ గ‌ర్ల్ అని అంటోంది న‌టి ప్రియాంకా చోప్రా. ఇది వ‌ర‌కే జీవితంలో ఎన్నో సాధించిన ఈ న‌టీమ‌ణి త‌న‌ను తాను ల‌క్కీగా ఫీల్ అవుతున్న‌ది మ‌రే విష‌యంలోనూ కాదు,…

ఈ ప్ర‌పంచంలో త‌ను ల‌క్కీయెస్ట్ గ‌ర్ల్ అని అంటోంది న‌టి ప్రియాంకా చోప్రా. ఇది వ‌ర‌కే జీవితంలో ఎన్నో సాధించిన ఈ న‌టీమ‌ణి త‌న‌ను తాను ల‌క్కీగా ఫీల్ అవుతున్న‌ది మ‌రే విష‌యంలోనూ కాదు, త‌న‌కు నిక్ జోన‌స్ దొర‌క‌డం విష‌యంలోన‌ట‌! స‌రిగ్గా రెండేళ్ల కింద‌ట త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నిక్ త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఆ ప్ర‌పోజ‌ల్ కు త‌ను 'య‌స్' చెప్పి కూడా నిన్న‌టితో రెండేళ్లు పూర్త‌య్యాయ‌ట‌. ఈ నేప‌థ్యంలో త‌న ఆనందాన్ని పంచుకుంది ప్రియాంక‌.

నిక్ జోన‌స్ అనే విదేశీయుడిని ఈమె పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌య‌సులో ప్రియాంక క‌న్నా నిక్ చాలా చిన్న వాడు. వివాహం అయ్యాకా వీరు వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నారు. కొన్ని అమెరిక‌న్ ప‌త్రిక‌లు వీరు విడిపోతున్నారంటూ క‌థ‌నాలు రాశాయి. నిక్ ఆస్తిని చూసి ఈమె అత‌డిని పెళ్లి చేసుకుంద‌నే అక్క‌సు రాత‌లూ రాశాయి. అయితే వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా ఈ జంట వివాహ‌బంధాన్ని సాగిస్తూ ఉంది.

ఈ క్ర‌మంలో నిక్ తో త‌ను చాలా ఆనందంగా ఉన్న‌ట్టుగా చెబుతూ ప్రియాంక ఇన్ స్టాగ్ర‌మ్ లో పోస్టు షేర్ చేసింది. నిక్ త‌న‌కు ప్ర‌పోజ్ చేయ‌గానే ఏం మాట్లాడాలో కూడా తెలియ‌నంత‌ ఆనందం క‌మ్మేసింద‌ని ప్రియాంక వివ‌రించింది. రెండేళ్లుగా అదే ఆనందంలో ఉన్న‌ట్టుగా పేర్కొంది. 2018 మే నెల నుంచి నిక్- ప్రియాంక‌లు డేటింగ్ మొద‌లుపెట్టార‌ట‌. అదే ఏడాది నిక్ ఈమెకు ప్ర‌పోజ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ప్రేమ త‌ర్వాత‌ పెద్ద‌గా విరామం లేకుండా వీరు పెళ్లి చేసేసుకున్నారు.

ఇక ప్రియాంక పోస్టుపై నిక్ కూడా స్పందించాడు.  త‌న ప్ర‌పోజ‌ల్ కు య‌స్ చెప్పినందుకు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. ఐ ల‌వ్యూ బ్యూటిఫుల్ అంటూ మ‌రోసారి ఆమెకు ప్రేమ ప్ర‌తిపాద‌న చేశాడు.

చిలుకూరు ఆల‌యంలో అద్భుతం