హీరోయిన్ ఎమీ జాక్సన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తమకు మగబిడ్డ పుట్టినట్టు ఎమీ స్వయంగా ప్రకటించింది. కొడుకు పేరును ఆండ్రెస్ గా ప్రకటించింది. 27 ఏళ్ల ఎమీ జాక్సన్ కొన్నాళ్లుగా జార్జ్ పనయోటుతో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అనుకోకుండా గర్భం దాల్చానని గతంలోనే ప్రకటించిన ఎమీ, ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వచ్చే ఏడాది ఎమీ-జార్జ్ పెళ్లి చేసుకోబోతున్నారు.
రజనీకాంత్ తో చేసిన 2.O తర్వాత మళ్లీ సినిమాలకు కమిట్ అవ్వలేదు ఎమీ జాక్సన్. పూర్తిగా బాయ్ ఫ్రెండ్ తో ప్రైవేట్ లైఫ్ కే పరిమితమైపోయింది. ఈ క్రమంలో తను ప్రెగ్నెంట్ అయ్యాననే విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఎమీ.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూనే ఉంది.
ఈ ఏడాది జనవరి 1న జాంబియాలో ఎమీ-జార్జ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వచ్చే ఏడాది గ్రీస్ లోని ఓ అందమైన దీవిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఎమీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు అందిస్తున్నారు.