అత్తారింటికి దారేది సినిమాలో ఆకులు రాల్చే సీను ఇప్పటికీ జనాలు మరిచిపోలేదు. అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ గా వుంటుంది. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్ లో అబద్దాలు మాట్లాడితే ఆకులు రాలే చెట్టు ఎపిసోడ్ ను డిజైన్ చేసారు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ ఆకులు రాల్చే చెట్టు మరో సినిమాలో దర్శనం ఇవ్వబోతోందని తెలుస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా తీస్తున్న పొలిటికల్ సెటైర్ సినిమా పవర్ స్టార్ లో ఈ ఆకులు రాలే చెట్టు సీన్ ను పెట్టినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కాదు, పవన్ నే చెట్టును పరీక్షిస్తాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ రివర్స్ వ్యవహారం. అబద్దం చెబితే ఆకులు రాలడం కాదు. నిజం చెబితేనే ఆకులు రాలడం.
మొత్తం మీద ఆర్జీవీ తన పవర్ స్టార్ సినిమా కోసం ఎన్ని మసాలాలు దట్టించాలో అన్నీ దట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో 'గడ్డి తింటావా' అనే పాట వుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పాత్ర తన ఫార్మ్ హవుస్ లో పశులను ఉద్దేశించి 'గడ్డి తింటావా..పాలు ఇస్తావా' అని పాట పాడుతుందని తెలుస్తోంది. ఇంకెన్ని వింతలు వుంటాయో ఈ సినిమాలో తెలియాల్సి వుంది. తొలిప్రేమ విడుదల డేట్ అయినా జూలై 25న విడుదల చేస్తున్నారు.