సిద్ శ్రీరామ్ ‘టాప్ గేర్’

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆది సాయికుమార్. అతగాడు చేస్తున్న లేటెస్ట్ మూవీ.. టాప్ గేర్. శశికాంత్ దర్శకుడు. శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా కోసం ఓ మాంచి మెలోడీని…

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆది సాయికుమార్. అతగాడు చేస్తున్న లేటెస్ట్ మూవీ.. టాప్ గేర్. శశికాంత్ దర్శకుడు. శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా కోసం ఓ మాంచి మెలోడీని తయారు చేసారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. 

'వెన్నెల వెన్నెల' అంటూ సాగిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా సాగుతూనే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సాంగ్ లోని సన్నివేశాలు, మ్యూజిక్ పాటను క్యాచీకగా తయారు చేసాయి.

టాప్ గేర్ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది.