స్టార్ క్రికెటర్ ధోనీకి కార్లు, బైక్స్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. తన టేస్ట్ కు తగ్గట్టు ఖరీదైన కార్లు, బైకుల్ని కొనుక్కోవడం ధోనీ హాబీ. ఇందులో భాగంగా తాజాగా కియా కంపెనీకి చెందిన ఓ కారును కూడా ధోనీ సొంతం చేసుకున్నాడు. రోల్స్ రాయిస్, బెంజ్ నుంచి చాలా ఖరీదైన కార్లు ధోనీ గ్యారేజీలో ఉన్నాయి. మరి ధోనీ దగ్గరున్న కార్లలో చవకైన కారు ఏది?
ప్రస్తుతం ధోనీ దగ్గర 15 కార్లు ఉన్నాయి. వీటిలో చవకైన కారు మహీంద్ర స్కార్పియో. చాన్నాళ్ల కిందటే ఎంతో ఇష్టపడి ధోనీ ఈ బండి కొనుక్కున్నాడు. ప్రస్తుతం అతడి దగ్గరున్న వెహికల్స్ లో తక్కువ ఖరీదైన బండి ఇదొక్కటే.
నిజానికి ధోనీ కలెక్షన్ లో నిస్సాన్ కంపెనీకి చెందిన జోంగా, హిందూస్థాన్ మోటార్స్ కు చెందిన అంబాసిడర్ కార్లు కూడా ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే, స్కార్పియో కంటే ఇవి చవకైన కార్లు. కానీ వీటికి రేటు కట్టలేం. ఎందుకంటే వింటేజ్ కార్ల లిస్ట్ లోకి ఇవి ఎప్పుడో చేరిపోయాయి. స్కార్పియో అలా కాదు కాబట్టి, ధోనీ దగ్గరున్న కార్లలో తక్కువ రేటు కారు ఇదే.
ప్రస్తుతం ధోనీ దగ్గరున్న ఖరీదైన కారుగా రోల్స్ రాయిస్ గుర్తింపు పొందింది. దీని తర్వాత ఫెరారీ కారు రెండో స్థానంలో నిలవగా.. బెంజ్, ల్యాండ్ రోవర్, ఆడీకి చెందిన కొన్ని ఖరీదైన కార్లు ధోనీ వద్ద ఉన్నాయి. వీటిలో ధోనీ రెగ్యులర్ గా వాడే కారు ల్యాండ్ రోవర్.