Advertisement

Advertisement


Home > Movies - Movie News

కాపీ కొట్టేందుకే కోట్లకు కోట్లు

కాపీ కొట్టేందుకే కోట్లకు కోట్లు

తెలుగు సినిమా రంగంలో ఓ దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు తప్ప పెద్ద సినిమాలకు ఆప్షన్ లేకుండా పోయింది. దేవీశ్రీ ప్రసాద్, థమన్ ఈ ఇద్దరే. కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు. కానీ ఇచ్చేవి కాపీ ట్యూన్ లు. చేయించుకునే దర్శకులు కూడా మహా ప్రసాదం అని వాటినే అందుకోవడం. ట్రోలింగ్ జ‌రిగితే మాకేంటీ..పాట హిట్ అయిందా లేదా అన్నదే చూస్తున్నారు.

పుష్ప టైమ్ లో ఊ అంటావా మామా..ఊఊ అంటావా పాట ను దేవీ ఎక్కడి నుంచి ఎత్తుకు వచ్చాడో సోషల్ మీడియా క్లారిటీగా ఎత్తి చూపింది. రెండు రోజులు హడావుడి. పాట బ్లాక్ బస్టర్. అంటే ఎవడిదో క్రియేటివిటీ నిస్సిగ్గుగా దొచుకున్నందుకు దేవీకి రెమ్యూనిరేషన్.

నిన్నటికి నిన్న మెగాస్టార్ సినిమాకు దేవీ ఇచ్చిన పాట ఎక్కడితో, మూలం ఏమిటో జ‌నం చాటింపు వేసారు. అయినా పట్టేది ఎవరికి?

ఈ రోజు మరో పాట వచ్చింది, థమన్ సంగీతం. అత్యంత దారుణంగా, హేయంగా కాపీ ట్యూన్ అందించాడు. గతంలో వందేమాతరం శ్రీనివాస్ అందించిన ఒసే రావులమ్మా టైటిల్ సాంగ్ ను ఎత్తుకొచ్చేసాడు థమన్. దాని మీద సోషల్ మీడియా హోరెత్తింది. అయినా ఎవరికి పడుతుంది. మన పాట జ‌నంలోకి వెళ్లిందా లేదా అన్నది తప్ప మరో ఆలోచన లేదు. ఈ కాపీ ట్యూన్ లు అందించేందుకు స్టార్ హోటళ్లలో ఖరీదైన అకామిడేషన్లు, కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్లు.

ఇచ్చిన ట్యూన్ ను తీసుకునే దర్శకులకు వుండాలి ముందుగా ఆలోనచ అన్నది. రిజ‌క్ట్ చేయగల దమ్ము వుండాలి. అప్పుడే ఒరిజినల్ ట్యూన్ లు వస్తాయి. లేకుంటే ఇలా కట్ అండ్ పేస్ట్ లే దిక్కు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?