స్టయిలిష్ స్టార్ బన్నీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ఏముందో, ఏమి లేదో వారిద్దిరికే తెలియాలి కానీ, గ్యాసిప్ లు మాత్రం బోలెడు వున్నాయి. ఈయనకు ఆయనకు అంతగా పొసగడదని, అందుకే బన్నీ టీమ్ ఎవ్వరూ తనకు పని చేయకూడదని చరణ్ దూరం పెట్టాడని టాక్ వుంది. ఇవన్నీ ఎంత నిజాలో తెలియదు కానీ, బన్నీ వ్యవహార శైలి కూడా అలాగే వున్నట్లుగా వుంది.
సైరా లాంటి సినిమా, అలాంటి మెగా ఈవెంట్ మరోటి వుండదు. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ అందరూ హాజరయ్యారు. సాయిధరమ్ తేజ్ రాజమండ్రిలో షూట్ వుండి కూడా హాజరుకావడం విశేషం. కానీ లోకల్ లో వున్న బన్నీ మాత్రం హాజరుకాలేదు. ఎంత షూటింగ్ వున్నా రాత్రి ఎనిమిది గంటలకు ఫంక్షన్ కు రావడానికి పెద్దగా అభ్యంతరం, అడ్డంకులు వున్నాయని అనుకోవడానికి అయితే లేదు. కొంపల్లెలో షూట్, ఎల్ బి స్టేడియంలో ఫంక్షన్.
బహుశా ఇదంతా మెగాభిమానులకు కూడా తెలిసినట్లుంది. అందుకే కావచ్చు, అరవింద్ మాట్లాడానికి ప్రయత్నిస్తే, చేతులు ఊపుతూ మరీ అడ్డుకున్నారు. మీకు కానీ పవర్ స్టార్ కు కానీ తెలియని విషయం ఒకటి చెబుతా అంటూ, పాపం అరవింద్ రిక్వెస్ట్ చేసి, ఒక్క నిమిషం మాట్లాడాల్సి వచ్చింది.
నిజానికి అరవింద్ గారు చిరంజీవి కెరీర్ కు పెద్ద బ్యాక్ బోన్. అది అందరికీ తెలుసు. మెగాభిమానులకు తెలుసు. కానీ బన్నీ వైఖరి కారణంగా కావచ్చు అరవింద్ ను కూడా మెగాభిమానులు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు.
ట్రయిలర్ పై నో ట్వీట్
18న సైరా ట్రయిలర్ వచ్చింది. నాలుగు రోజులు అయింది. ఇప్పటి వరకు బన్నీ ట్వీట్ చేయలేదు. సైరా ట్రయిలర్ మీద అమితాబ్, అమీర్, సల్మాన్ లాంటి హేమా హేమీలు ట్వీట్ చేసారు. టాలీవుడ్ జనాల సంగతి చెప్పనక్కరలేదు. కానీ బన్నీ మాత్రం ఇప్పటి వరకు రెస్పాండ్ కాకపోవడం విశేషం. అటు ఇన్ స్టాలో కూడా షేర్ చేయలేదు. మరి ఇలా చేసి మెగాభిమానులను దూరం చేసుకుని బన్నీ సాధించేది ఏమిటో? లేదా తన స్వంత ఫ్యాన్ బేస్ తనకు వుందని బన్నీ భావన ఏమో?