ప్రపంచంలో ఎవరైనా పాసయ్యారా అని ప్రశ్నించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ఎవరైనా పాసయ్యారా అంటే స్కూల్ పరీక్షల్లోనో, కాలేజీ ఎగ్జామ్స్లోనో కాదండి. మంత్రి అడిగింది చాలా కీలక ప్రశ్న. ఎవరూ జవాబు చెప్పలేరు. పాసవడం అంటే ఎగ్జామ్స్‌లో పాసవడం కాదు. కరోనాను నియంత్రించడంలో అన్నమాట.
కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారంటూ ప్రతిపక్ష నేతలు అదే పనిగా విమర్శిస్తున్నారు. దీంతో ఒళ్లుమండిన కేటీఆర్ ‘కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారంటున్నారు. సరే…అయితే మరి పాసైంది ఎవరో చూపించండి’ అని సవాల్ చేశారు.
మన దేశంలో కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలించారో చూపించండి అన్నారు. కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానానికి చేరిందని, మరి ప్రధాని మోడీ విఫలమైనట్లేనా అని ప్రశ్నించారు. అంటే కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ కాలేదని చెప్పడమన్నమాట.