‘పోర్న్ తర్వాతే.. ప్రజలు ఎమ్మెల్యేను చేశారు..’

కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలను చూస్తూ పట్టుబడిన ఎమ్మెల్యేల్లో ఒకరు లక్ష్మణ్ సవది. ఈయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రుల్లో ఒకరు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా, ఈ వివాదాస్పద నేతకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు…

కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలను చూస్తూ పట్టుబడిన ఎమ్మెల్యేల్లో ఒకరు లక్ష్మణ్ సవది. ఈయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రుల్లో ఒకరు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా, ఈ వివాదాస్పద నేతకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు కమలనాథులు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో నీలిచిత్రాలు చూస్తూ పట్టుబడిన వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీదే అంటూ బీజేపీపై విమర్శల వాన కురుస్తూనే ఉంది.

మామూలుగా అయితే ఎన్నో నీతులు చెప్పే బీజేపీవాళ్లు.. ఇప్పుడు మాత్రం  ఈ విమర్శలు తమకు వినపడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సవది ఓడిపోయారు కూడా. అయినా ఆయనకు కుల సమీకరణాల కింద ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఈ అంశంపై ఆయన స్పందించారు.

అంతా అధిష్టానం దయ అని ఆయన అంటున్నారు. అమిత్ షా చెప్పినట్టుగా తను చేస్తానంటూ వీర విధేయతను ప్రకటించుకుంటున్నారు. ఇక అసెంబ్లీలో పోర్న్ వీక్షణపై స్పందిస్తూ.. ఆ విషయంపై ఎలాంటి పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. పైపెచ్చూ అసెంబ్లీలో పోర్న్ చూస్తే దొరికిపోయాకా జరిగిన ఎన్నికల్లో తను విజయం సాధించిన విషయాన్ని నొక్కిచెబుతూ ఉన్నారు.

సభలో బ్లూఫిల్మ్ లు చూసినా ప్రజలు తనను ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారీయన. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈయన ఓడిపోయారు. అయినా ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా దర్జాగా ఉన్నారు!

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు