న‌వ‌ర‌త్నాలు…న‌వ‌క‌ష్టాలు

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవ‌ల ఓ సినిమా ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమ‌ర్శ‌లు రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. ఈ నేప‌థ్యంలో…

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవ‌ల ఓ సినిమా ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమ‌ర్శ‌లు రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై ఆయ‌న వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శ‌ల దాడి చేస్తున్న‌ట్టు వైసీపీ భావిస్తోంది.

తాజాగా వైసీపీ మేనిఫెస్టోపై విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌వ‌ర‌త్నాలు..భావిత‌రాల పాలిట న‌వ‌క‌ష్టాలుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు రుద్దుతోందని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని, సంక్షేమం అసలే కాదని దెప్పి పొడిచారు.

‘నేటి నవరత్నాలు.. భావి తరాలకు నవ కష్టాలు’ అని ట్వీట్  చేశారు. వైసీపీ ప్రభుత్వ వాగ్దానాలు.. వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. 

ఇంత‌కాలం స్త‌బ్ధుగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్న‌ట్టుండి యాక్టీవ్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అందులోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ‌డం, ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్‌పై మంత్రులు, అధికార పార్టీ నేత‌లు పంచ్‌లు విసురుతున్నారు. దీంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.