ఓటిటిలోకి ‘భీమ్లా నాయక్’?

మోస్ట్ యాంటిసిపేటింగ్ సినిమా భీమ్లా నాయక్ ఓటిటి బరిలోకి వెళ్తుందా? ఇండస్ట్రీలో ఇదే బలమైన టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ – రానా-నిత్య మీనన్ లాంటి మల్టీ స్టార్ కాస్ట్ తో త్రివిక్రమ్ లాంటి…

మోస్ట్ యాంటిసిపేటింగ్ సినిమా భీమ్లా నాయక్ ఓటిటి బరిలోకి వెళ్తుందా? ఇండస్ట్రీలో ఇదే బలమైన టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ – రానా-నిత్య మీనన్ లాంటి మల్టీ స్టార్ కాస్ట్ తో త్రివిక్రమ్ లాంటి ఏస్ డైరక్టర్ సూపర్ విజన్ లో తయారవుతున్న ఈ భారీ సినిమా సరైన బేరం వస్తే ఓటిటికి ఇవ్వడానికి సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది.

అయ్యప్పన్ కొషియమ్ మెయిన్ థ్రెడ్ తీసుకుని, దానికి పక్కా కమర్షియల్ హంగులు అద్ది తీస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు గ్లింప్స్ కు, ఒక పాటకు మాంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్, అడియో రైట్స్ రికార్డు మొత్తానికి అమ్ముడు పోయాయి.

మిగిలిన నాన్ థియేటర్ హక్కులు (శాటిలైట్, డిజిటల్ ఎక్సెట్రా) కోసం 70 కోట్ల రేంజ్ లో బేరం చెబుతున్నారని బోగట్టా. రేట్లు, ఆక్యుపేషన్ ఇలా అన్నీ సజావుగా వుంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ కలిపి 80 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ వుంటుంది. అంటే సినిమా మొత్తం టర్నోవర్ 170 కోట్ల వరకు వుండే అవకాశం వుంది. 

ఇప్పుడు ఆ రేంజ్ మొత్తం వస్తే ఓటిటికి ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ, హీరో పవన్, ఇంకా సినిమాకు కర్త, కర్మ, క్రియ అయిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి సుముఖంగా వున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాదాపు బేరం అయిపోయిందనీ టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే తెలుగులో వందల కోట్ల రేంజ్ లో జరిగిన తొలి ఓటిటి డీల్ ఇదే అవుతుంది.

పవన్ సలహా

ఇదిలా వుంటే తనతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిర్మాతలు ముగ్గురికీ హీరో పవన్ క్లారిటీగా ఓటిటి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సినిమాల నిర్మాతలను పిలిచి, మీకు నచ్చితే, కుదిరితే ఓటిటికి వెళ్తామంటే వెళ్లండి, నాకు ఏ అభ్యంతరం లేదు, థియేటర్లోనే నా సినిమా వేయండి అని నేను వత్తిడేమీ చేయను అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

భవదీయుడు భగత్ సింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దసరాకు పూజ జరుపుకుంటుంది. భీమ్లానాయక్ దాదాపు టాకీ పూర్తి కావచ్చింది. హరిహర వీరమల్లుకు కాస్త ఎక్కువ వర్క్ నే బకాయి వుంది.