శృతిహాసన్ ఇదివరకే ఓసారి ప్రేమలో పడింది. లండన్ కు చెందిన కోర్సల్ తో ఆమె చాన్నాళ్లు డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి లండన్ లో కొన్ని నెలల పాటు గడిపారు. కేవలం కోర్సల్ కోసం శృతిహాసన్ తన కెరీర్ ను ఫణంగా పెట్టింది.
దాదాపు ఏడాది పాటు సినిమాలు చేయలేదు. కోర్సల్ తో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆమె ఓ మంచి టైమ్ చూసి తన తల్లిదండ్రులకు కూడా అతడ్ని పరిచయం చేసింది.
అయితే వాళ్ల సంబంధం సజావుగా సాగలేదు. కోర్సల్ నుంచి శృతిహాసన్ విడిపోయింది. తామిద్దరం విడిపోయాయమనే విషయాన్ని శృతి అఫీషియల్ గా ప్రకటించింది కూడా. మ్యూజిక్ తో కోర్సల్ ను మరిచిపోవడానికి ట్రై చేస్తున్నానంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది గతంలో.
అలా కొన్నాళ్లుగా సింగిల్ గా ఉంటున్న శృతిహాసన్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడినట్టు కనిపిస్తోంది. డూడుల్ ఆర్టిస్టు, హిప్ హాప్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న ఢిల్లీకి చెందిన శాంతనుతో ఆమె డేటింగ్ లో ఉంది. తాజాగా ఇతడి పుట్టినరోజును శృతిహాసన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా వచ్చిన ఫొటోలు వీళ్లిద్దరి ఎఫైర్ ను బయటపెట్టాయి.
తనకు పెళ్లి అంటే ఇష్టంలేదని, పెళ్లి-పిల్లలకు లింక్ పెట్టడం సరికాదని గతంలోనే స్టేట్ మెంట్ ఇచ్చింది శృతిహాసన్. శాంతనుతో ఆమె డేటింగ్ ఎఫైర్ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.