లూసిఫర్ ను రీమేక్ చేయాలన్న బలమైన సంకల్పం మెగాస్టార్ చిరంజీవిది. కానీ అదే టైమ్ లో ఆ సినిమాను పక్కన పెట్టించి, డైరక్టర్ బాబీ-మైత్రీ మూవీస్ సినిమాను ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్టా. ఇందుకోసం ఓ టాప్ డైరక్టర్ కాస్త గట్టిగానే కృషి చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమాలు సెట్ చేసి, లాభాల్లో వాటా అందుకోవడం అనే కొత్త కాన్సెప్ట్ ను స్వంత చేసుకుని ఆ విధంగా డబ్బులు ఆర్జించే పనిలో పడ్డారు ఈ డైరక్టర్. ఈ స్కీములోనే ఓ సినిమా సెట్ చేసి, లాభాల్లో వాటా సంపాదించుకున్నారన్న వార్తలు వున్నాయి. ఇప్పుడు డైరక్టర్ బాబీ సినిమాను కూడా అదే విధంగా సెట్ చేసే పనిలో వున్నారని వార్తలు వినవస్తున్నాయి.
ఇందులో భాగంగానే లూసిఫర్ వర్కవుట్ కాదని, స్క్రిప్ట్ సెట్ చేయడం కష్టమని ఆ డైరక్టర్ మెగా స్టార్ కు మైండ్ వాష్ చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అంతే కాదు, అసలు ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని ఫీలర్లు బయటకు ఆయన తన టీమ్ ద్వారా వదుల్తున్నారని టాక్ వుంది. నిన్నటికి నిన్న కూడా మెగాస్టార్ సన్నిహిత వర్గాలు, లూసి ఫర్ పై వస్తున్న గ్యాసిప్ ల గురించి డిస్కస్ చేసుకుని, ఇలాంటి వార్తల వల్ల ఆ సినిమా డైరక్ట్ చేయాలనుకునే సుజిత్ ఫీలవుతున్నాడని చెప్పుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇప్పుడు మెగాస్టార్ ఆచార్య మినహా తాను చేయాలనుకున్న అన్ని ప్రాజెక్టులను అలాగే వుంచారని, ఏ వర్క్ ఆపలేదని మెగాస్టార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కరోనా కల్లోలం ముగిసే వరకు ఏ క్లారిటీ రాదని ఆ వర్గాల బోగట్టా.