నిన్నటికి నిన్న రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి బాధపడినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అంతా కలిసి, ప్రభుత్వం దగ్గరకు రాయబారాలు నడిపి, అంతా సర్దుబాటు చేసి, ఇక ఒకటి రెండు రోజుల్లో కొత్త టికెట్ ల జీవో వస్తందనగా, మొత్తం వ్యవహారం చెడిపోయిందని ఆయన ఫీలయినట్లు తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ రీమేక్ కోసం ప్రస్తుతం ఆయన ఊటీలో వున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన మూడాఫ్ గా వున్నట్లు యూనిట్ వర్గాల బొగట్టా.
చాంబర్ స్టేట్ మెంట్
పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆయన వ్యక్తిగతం అని, చాంబర్, కౌన్సిల్ లాంటి అధారిటీ బాడీలకు దాంతో సంబంధం లేదని. కౌన్సిల్, చాంబర్ సభ్యులంతా ఆంధ్ర ప్రభుత్వానికి మద్దతుగా వుంటారని ఓ స్టేట్ మెంట్ ను ఈ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ ను కూడా ఓ ప్రకటన చేయమని వత్తిడి చేస్తున్నట్లు బోగట్టా. ముందుగా కౌన్సిల్ నుంచి ఓ ప్రకటన మరి కొద్ది సేపట్లో విడుదలవుతుంది.