సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లు అయిందని సామెత. పవన్ కళ్యాణ్ ప్రసంగం, ఆ సమయంలో అక్కడ వున్న దిల్ రాజుకు చుట్టుకుంటోంది. వైకాపా వర్గాలు ఆయన మీద గుర్రుగా వున్నాయని తెలుస్తోంది.
పవన్ ప్రసంగం సందర్భంగా దిల్ రాజు పడీ పడీ నవ్విన విడియోలు అప్పుడే పార్టీ వర్గాలు సిఎమ్ఓ ఆఫీసుకు చేరవేసినట్లు తెలుస్తోంది. అసలే వైకాపా అధిష్టానం దగ్గర దిల్ రాజుకు ఇప్పుడు అంత పాజిటివ్ సీన్ లేదు. దీంతో మరింత నెగిటివ్ అవుతోందని తెలుస్తోంది.
కొత్త టికెట్ ల జీవో వచ్చినా కూడా చాలా చోట్ల నూరు శాతం ఆక్యుపెన్సీ, అలాగే వందరూపాయల రేట్లు ఇష్టం వచ్చినట్లు అమలు చేసేసారు. ఉత్తరాంధ్రలో ఇలా చేసిన వాటిలో దిల్ రాజు థియేటర్లు కూడా వున్నాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఎమ్మార్వోలు, ఆర్డీవోలకు ఎక్కడ ముట్టాల్సింది అక్కడ ముట్టచెప్పి పనులు కానిచ్చారు. దాంతో ఈ రోజు ప్రభుత్వం కదిలింది. జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడికక్కడ నిఘా పెట్టారనే వార్తలు వచ్చాయి.
దాంతో ఉత్తరాంధ్రలోని తన థియేటర్లు అన్నీ కచ్చితంగా రూల్స్ మీదనే వెళ్లాలని డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ చాలా థియేటర్లలో అలా జరగడం లేదు.
ఆయన థియేటర్లో కాదో తెలియదు కానీ చోడవరం, శ్రీకాకుళం లాంటి థియేటర్లలో 100 రూపాయిలు ప్లస్, చార్జెస్ కలిపి విక్రయించేస్తున్నారు.
బుక్ మై షో లోనే
ఇదిలా వుంటే బుక్ మై షో లో అధికారికంగానే 100 రూపాయలు అమ్మేస్తున్నారు. శ్రీకాకుళం లాంటి సెంటర్ లో లవ్ స్టోరీ 70 రూపాయలు అమ్మాల్సి వుండగా 100 లకు అమ్ముతున్నారు. దానికి టాక్స్ లు అన్నీ అదనం. కొన్ని ఊర్లలో బుక్ బై షో లో తీసేసి, కేవలం కౌంటర్ సేల్స్ చేస్తున్నారు.