ఏపీలో ఎన్నికల ఫీవర్ మెల్లగా మొదలవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తి అయింది. మిగిలిన సగంలో చివరి ఏడాది ఎటూ ఎన్నికల కోలాహలం ఉండనే ఉంటుంది. దాంతో ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల మీద చర్చ యమ జోరుగా సాగుతోంది.
ఏపీలో అన్ని ఎన్నికలను గెలిచి ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీ 2024లోనూ అదే ఊపు కొనసాగించాలనుకుంటోంది. దీని మీద వైసీపీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీకి తిరుగులేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నిక ఏదైనా జనాలు తమ పార్టీని ఆదరిస్తున్నారని ఆయన అంటున్నారు.
అందువల్ల 2024లో జరిగే ఎన్నికలలోనూ వైసీపీ జెండాకు ఎదురులేదని బొత్స జోస్యం చెప్పేశారు. పంచాయతీల నుంచి పార్లమెంట్ సభ్యుల దాకా నెగ్గిన వైసీపీ ఏపీ రాజకీయాలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది అని కూడా అన్నారు.
లోకల్ బాడీ ఎన్నికలలో గెలిచిన వారంతా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేలా తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని బొత్స సూచించారు. మొత్తానికి బొత్స వంటి సీనియర్ చెప్పిన మాట ఏపీలో విపక్షాలకు గట్టి షాకే అనుకోవాలి.
ఆయన జోస్యం వైసీపీలో ధీమా పెంచితే విపక్షం డీలా అయ్యేలా చేస్తోంది అంటున్నారు.