ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు తమదైన స్టైల్‌లో విరుచుకుపడుతున్నారు. పవన్‌పై విమర్శల దాడి చేయడంలో మంత్రి అనిల్‌కుమార్ ముందు వరుసలో ఉండే విషయం తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై సెటైర్లు విసిరారు. పవన్‌కల్యాణ్ నటించినా, సంపూర్ణేష్‌బాబు నటించినా కష్టం ఒకటేనన్నారు.
ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? అని పవన్‌ను అనిల్ ప్రశ్నించారు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం ఆలోచనగా అనిల్ చెప్పుకొచ్చారు.
పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్ అన్నారు. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటోందన్నారు. ఇది ఎంతవరకు సబబు అని అనిల్ ప్రశ్నించారు.
తన ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ అనడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ని తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు.
‘ప్రభుత్వ తీరును మారుస్తాను, నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం’ అని పవన్ కల్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని వ్యంగ్యంగా అన్నారు. పవన్‌కల్యాణ్ పోపోవయ్యా చూశాం నీ కథ అన్నట్టుగా అనిల్ మాట్లాడ్డం వైసీపీ శ్రేణుల్ని ఆకట్టుకుంటోంది. పవన్‌కల్యాణ్ ఉద్దేశం ఏమైనప్పటికీ …అనవసరంగా మాట్లాడి తిట్లు తిట్టించుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి.