ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేనాని పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడానికి ప్రత్యేకంగా కారణాలవసరం లేదు. ఎందుకంటే జగన్‌ను విమర్శించడం తన హక్కు అని పవన్ భావిస్తుంటారు.
నిన్న రాత్రి ఓ సినిమా ఫంక్షన్లో జగన్‌పై పవన్ నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌పై మంత్రులు, వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. నువ్వొకటి అంటే, తాము పది మాటలంటామని నోటికి పని చెప్పారు.
పవన్‌కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వెల్లంపల్లి సీరియస్ రియాక్షన్ వైరల్ అయ్యింది. చిరంజీవి, నాగార్జున లాంటి సినీపెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని చెప్పారు.
బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్‌పై వెల్లంపల్లి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
‘పావలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచడానికే పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లుంది. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలి. రెండేళ్లుగా ప్రజలే పవన్ తాట తీశారు. సినీ పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రాజకీయాల్లో పనికి మాలిన స్టార్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం’ అని వెల్లంపల్లి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.