దీపావళి.. మొహం చాటేసిన స్టార్ హీరోలు

ఈ దీపావళికి కొంతమంది స్టార్ హీరోలు చక్కగా కలుసుకున్నారు. రామ్ చరణ్ ఇంట్లో ఎంచక్కా పార్టీ చేసుకున్నారు. అయితే అదే ఆనందాన్ని అభిమానులకు మాత్రం ఇవ్వలేకపోయారు. రామ్ చరణ్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్.. ఇలా…

ఈ దీపావళికి కొంతమంది స్టార్ హీరోలు చక్కగా కలుసుకున్నారు. రామ్ చరణ్ ఇంట్లో ఎంచక్కా పార్టీ చేసుకున్నారు. అయితే అదే ఆనందాన్ని అభిమానులకు మాత్రం ఇవ్వలేకపోయారు. రామ్ చరణ్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్.. ఇలా స్టార్స్ అంతా దీపావళిని ఎంజాయ్ చేశారు కానీ, తమ సినిమాల అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కు మాత్రం ఎంజాయ్ మెంట్ అందించలేకపోయారు.

ఈ దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ వస్తుందని మెగాభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ దీపావళి కంటే ముందే అలాంటిదేం లేదని తేల్చిచెప్పేశాడు దిల్ రాజు. ఆడియో రైట్స్ కు సంబంధించి డాక్యుమెంటేషన్ లో ఇబ్బందుల వల్ల సాంగ్ రావడం లేదని తెలిపాడు. ఇంతవరకు బాగానే ఉంది. సాంగ్ లేనప్పుడు కనీసం దీపావళికి ఓ పోస్టర్ అయినా రిలీజ్ చేయొచ్చు కదా..

గుంటూరు కారంది కూడా అదే పరిస్థితి. ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇక తమ పనైపోయిందన్నట్టు ఊరుకున్నారు. అదే ఊపులో దీపావళికి మరో మాస్ పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుండేది, సినిమాకు మరింత హైప్ వచ్చి ఉండేదని చాలామంది అభిప్రాయం.

దేవర విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా విషయంలో అంతా గుంభనంగా సాగుతోంది. పుష్ప-2, కల్కి సినిమాలది కూడా ఇదే పరిస్థితి. వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి దీపావళికి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. వీళ్లు మాత్రమే కాదు, నాగార్జున, పవన్ కల్యాణ్ లాంటి హీరోల నుంచి కూడా ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇలా ఈ ఏడాది స్టార్ హంగామా లేకుండానే దీపావళి ముగిసింది.