ఏపీ సర్కార్ మాస్క్‌లు పెట్టుకోవడం తప్పని సరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే ప్రదేశాలతో పాటు ప్రయాణాల సమ యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఓ మాస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మాస్క్ ఎంతో ఖరీదైంది. ఆ మాస్క్ మామూలుది కాదు. బంగారు మాస్క్. అందుకే ఆ మాస్క్ వార్తలకెక్కింది. ఒడిశాలోని కటక్‌కు చెందిన వ్యాపారి అలోక్ మొహంతికి బంగారంపై అమితమైన వ్యామోహం. దీంతో అతను రూ.3.50 లక్షలు ఖర్చు పెట్టి ఏకంగా బంగారంతో మాస్క్‌ను తయారు చేయించాడు.
తనకు మహారాష్ట్రలోని ఓ వ్యక్తి స్ఫూర్తి అని అతను చెప్పుకొచ్చాడు. మహారాష్ట్ర వాసి బంగారు మాస్క్ ధరించడాన్ని టీవీలో చూసినప్పటి నుంచి…తాను కూడా అలాంటిది తయారు చేయించుకోవాలనే కోరిక పుట్టిందన్నాడు. దీంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ కోరిక తీర్చుకోవడానికి వెనుకాడలేదని అతను చెప్పుకొచ్చాడు.