పవన్ కాళ్లు పట్టుకున్న హరీష్ శంకర్

మెగా కాంపౌండ్ లో పవన్ కూడా బాగానే డాన్స్ చేస్తాడు. బద్రి, తమ్ముడు లాంటి సినిమాలతో ఆ మేటర్ ప్రూవ్ అయింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే డాన్స్ చేయడం ఆపేశాడు పవన్. సాంగ్…

మెగా కాంపౌండ్ లో పవన్ కూడా బాగానే డాన్స్ చేస్తాడు. బద్రి, తమ్ముడు లాంటి సినిమాలతో ఆ మేటర్ ప్రూవ్ అయింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే డాన్స్ చేయడం ఆపేశాడు పవన్. సాంగ్ అనగానే సైలెంట్ అయిపోయేవాడు. చివరికి పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే చిన్న చిన్న మూమెంట్స్ కు కూడా మొహం వాచిపోయేలా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇలా డాన్స్ లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పవన్ తో తిరిగి డాన్స్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లో అతడితో డాన్స్ చేయించేందుకు ఏకంగా కాళ్లు పట్టుకున్నానని తెలిపాడు.

“స్విట్జర్లాండ్ లో పిల్లా నువ్వులేని జీవితం అనే సాంగ్ చేస్తున్నాం. పవన్ కు విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇక తన వల్ల కాదని, హైదరాబాద్ వెళ్లి బ్యాలెన్స్ చేసుకుందామని చెప్పారు. అయినా నేను పట్టు వదల్లేదు. మీ డాన్స్ చూడాలని ఆడియన్స్ చచ్చిపోతున్నారు, చాలారోజుల నుంచి మీరు డాన్స్ చేయడంలేదు. స్టార్టింగ్ లో డాన్స్ రుచిచూపించి ఆపేశారు. మళ్లీ అలాంటి స్టెప్పులేయాల్సిందే. పైగా ఈ పాటకు స్టెప్పులు అవసరం అన్నాను. స్టెప్పులేయండి ప్లీజ్ అంటూ ఆల్ మోస్ట్ ఆయన కాళ్ల మీద చేతులు వేశాను. వెంటనే పవన్ నా చేతుల్ని ఆపేశారు. నువ్వు డైరక్టర్ వి అలా చేయకూడదన్నారు. వెంటనే వచ్చి స్టెప్పులేశారు.”

తను చేసిన ప్రయత్నం వందశాతం ఫలించి పవన్ వెంటనే స్టెప్పులేశారని గుర్తుచేసుకున్నారు హరీష్. అయితే డాన్స్ మాస్టర్ చెప్పినట్టు చేయడానికి పవన్ ఒప్పుకోలేదట. పాటలో భావం, సన్నివేశం అర్థం చేసుకొని, ఎక్కడ డాన్స్ మూమెంట్ ఉండాలో అక్కడ మాత్రమే డాన్స్ చేశారని చెప్పుకొచ్చాడు హరీష్. పవన్ కు డాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగించేందుకు తను పాటను కూడా వివరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

మరోవైపు పవన్ తో సినిమా అంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించాడు హరీష్. అందరూ గట్టిగా కోరుకుంటే పవన్ తో సినిమా చేస్తానంటున్నాడు. కథలకు లోటు లేదని, పవన్ ఓకే అంటే ఇప్పుడే వెళ్లి ఆయనకు ఫుల్ నెరేషన్ కూడా ఇస్తానంటున్నాడు.

పవన్ సినిమా క్యాన్సిల్ అయితే నా మానసిక పరిస్థితి ఇది