గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే. అనంతపురం ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నపుడే వాల్మీకి టైటిల్ మీద అభ్యంతరం వచ్చింది. అప్పుడే ఆల్టర్ నేటివ్ టైటిల్ ఆలోచించి వుండాల్సింది. అదే అద్భుతమైన టైటిల్ అన్నట్లుగా. దానికి ఆల్టర్ నేటివ్ లేదన్నట్లుగా వుండిపోయారు. ఇప్పుడేమయింది రెండు జిల్లాల్లో సినిమా ప్రదర్శన నిలిపివేసారు.
ఇప్పుడు నిర్మాతలు, దర్శకుడు కిందామీదా అవుతున్నారు. అర్జెంట్ గా టైటిల్ మార్చి, ఆ విషయం కోర్టు ద్వారా విన్నవించుకుని, సినిమా ప్రదర్శన ఆగకుండా చూసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఇది కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు. మళ్లీ టైటిల్ కార్డ్ పిక్చరైజ్ చేసి, క్యూబ్ కు అప్ లోడ్ చేయాలి. అదో ఖర్చు కూడా.
గద్దలకొండ గణేష్ అనే హీరో పేరునే సినిమా టైటిల్ గా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇదే మొదట చేసివుంటే ఇంత టెన్షన్ వుండేదికాదు. గంటం పట్టుకోవాల్సిన వాల్మీకి చేతిలో తుపాకి పట్టుకున్నట్లు చూపించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అభ్యంతరాలు వచ్చినపుడే టైటిల్ మార్పుచేసి వుంటే ఏ గొడవా వుండేదికాదు.