Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరాలో కూడా మూడే పాటలు

రాజమౌళి-ఎన్టీఆర్-చరణ్ ల ఆర్ఆర్ఆర్  సినిమాలో మూడేపాటలు వుంటాయని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రాబోతున్న సైరా సినిమాలో కూడా మూడే పాటలు వుంటాయని తెలుస్తోంది. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలి అంటే జస్ట్ రెండు పాటలు మాత్రమే.

సైరా..సై సైరా అన్న టైటిల్ సాంగ్ టైటిల్స్ వస్తున్నపుడే అయిపోతుందట. అందువల్ల మిగిలినవి ఇక రెండు పాటలే. అందులో ఒకటి డ్రమ్స్ సాంగ్. ఇంద్ర సినిమాలోని ఘల్లు ఘల్లుమని...అనే పాట టైపులో భారీగా జనాలతో చిత్రీకరించారు ఈ పాటను.

ఇక రెండో పాట హీరోయిన్ తమన్నా మీద చిత్రీకరించారు. ఈ రెండు పాటలే కీలకం. అయితే రెండు పాటలు బాగున్నాయని, అందులో తమన్నా మీద చిత్రీకరించిన పాట హైలైట్ అని తెలుస్తోంది. మొత్తం మీద ఇవే పాటలు. 

చిరు 150వ సినిమాకు పాటలే హైలైట్ అయితే, 151 సినిమాకు మాత్రం పోరాట సన్నివేశాలే హైలైట్ అని అనుకోవాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?