అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ డైరక్టర్. కానీ మనం తరవాత మళ్లీ ఆ రేంజ్ ఆల్బమ్ ఇవ్వలేదు. చేతినిండా సినిమాలు వుంటున్నాయి కానీ ఒకటీ అరా పాటలే ఓ రేంజ్ కు వస్తున్నాయి.
ఆ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో 'నీలి నీలి ఆకాశం' పాట భయంకరంగా పాపులర్ అయింది. ఆ పాట కోసమే సినిమాకు జనం వచ్చారంటే అతిశయోక్తి కాదు. కానీ ఫుల్ ఆల్బమ్ సరైనది రాలేదన్న వెలితి అలాగే వుంది.
ఇలాంటి టైమ్ లో మారుతి డైరక్షన్ లో 'మంచి రోజులు వచ్చాయి' నుంచి రెండు పాటలు వచ్చాయి. రెండూ బాగున్నాయి అనిపించుకోవడమే కాదు, యూ ట్యూబ్ లో మిలియన్ల హిట్ లు అందుకున్నాయి.
'సోసోగా వున్నవాణ్ణి' , 'ఎక్కేసింది..ఎక్కేసింది' పాటలు రెండూ రేడియోల్లో మోగుతున్నాయి. ఇదే ఆల్బమ్ నుంచి మరో రెండు మంచి పాటలు వస్తున్నాయని బోగట్టా.
ఇది కాక నాగార్జున బంగార్రాజు సినిమా కు కూడా అనూప్ నే పనిచేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరక్టర్. ఆయన కూడా మంచి పాటలే చేయించుకుంటారు. చూస్తుంటే అనూప్ కు మళ్లీ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది.