సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న ఓ స్టార్ హోటల్ లో తన ఫ్యాన్స్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుల గురించి ఓపెన్ గా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
సర్కారు వారి పాట సినిమా పోకిరిని మించి వుంటుందని, పూరి శిష్యుడిగా పరుశురామ్ అలాంటి సినిమా అందిస్తున్నాడని మహేష్ చెప్పారు. సింగిల్ టేక్ లో కథ ఓకె చేసా అన్నారు.
త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళితో సినిమా చేయబోతున్నా అని క్లారిటీ ఇచ్చారు. అంటే గతంలో వినిపించిన అనిల్ రావిపూడి సినిమా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే. 2022 లో తివిక్రమ్ సినిమా అంటే రాజమౌళి సినిమా కనీసం రెండేళ్లు వేసుకోవచ్చు.
ఈ లెక్కన అనిల్ రావిపూడికి కానీ, వంశీ పైడిపల్లికి కానీ అవకాశం రావాలంటే మరో మూడేళ్లు ఎదురు చూడాలి.
వంశీ పైడిపల్లి విజయ్ తో సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఎఫ్ 3 తరువాత బాలయ్యతో సినిమా చేయాల్సి వుంది. రాజమౌళితో చేసే సినిమాతో మహేష్ ప్యాన్ ఇండియాకు డైరక్ట్ గా పరిచయం అవుతారు.