కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఎవరికుండదు? అయితే ఆ శ్రీవారు దర్శనభాగ్యం కలిగిస్తేనే ఏదైనా సాధ్యం. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇవాళ విడుదల చేసిన సర్వదర్శనం టికెట్లు అర్ధగంటలో అయిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు.
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ నిబంధనలు సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్వామి వారి సర్వ దర్శనానికి ఆన్లైన్లో అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మేరకు శనివారం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకూ సర్వదర్శనం టికెట్లను ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అధికారులు విడుదల చేశారు. రోజుకు 8 వేల చొప్పున 35 రోజులకు గాను 2,80.000 టికెట్లను .భక్తులు కేవలం 30 నిమిషాల్లో బుక్ చేసుకు న్నారు.
గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని సర్వర్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీ విధించిన కోవిడ్ నిబంధనలు భక్తులు పాటించి దర్శనానికి రావాలని అధికారులు కోరారు.