హిట్ సినిమా సిరీస్ హాట్ హాట్ గా మారుతోంది. హిట్ తొలి సినిమా పెద్ద సక్సెస్ అయింది. అడవిశేష్ హీరోగా, బ్యాక్ బోన్ గా హిట్ 2 రెడీ అవుతోంది. దీని తరువాత ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలన్నది నిర్మాత నాని…మేకర్ అడవి శేష్ ల ఆలోచన అంట. అయితే ఈ ఆలోచనకు ఒక్కటే మినహాయింపు. ఒక్కో హిట్ భాగం హిట్ అవుతూ వుంటే మరో పార్ట్ వస్తుంది..లేదంటే లేదు.
ఇదిలా వుంటే టోటల్ గా ఎనిమిది హిట్ సిరీస్ లు తీయడానికి పాయింట్లు అడవిశేష్ దగ్గర వున్నాయట. అవి కేవలం పాయింట్లు మాత్రమే. కానీ హిట్ 3 కి మాత్రం బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుందట. ఈ మూడో భాగం మాత్రం చిన్న సినిమాగా కాదు. మాంచి భారీ మల్టీ స్టారర్ అంట. ఇందులో అడవిశేష్ తో పాటు నాని కి కూడా కీలకపాత్ర వుంటుదట. అలాగే విజయ్ సేతుపతి కి కూడా మాంచి రోల్ వుంటుందట.
పైగా హిట్ 3 మొత్తం సినిమా అమెరికాలో జరుగుతుందట. హిట్ 2 హిట్ అయితేనే హిట్ 3 తీయాలని అనుకోవడం లేదట. హిట్ 2 జయాపజయాలతో సంబంధం లేకుండా హిట్ 3 తీయాలన్నది నాని, అడవి శేష్ ల నిర్ణయం అని తెలుస్తోంది.