ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నడుం గిల్లితే అమ్మాయే చెంప మీద ఒక్కటేస్తుంది. అలాంటి మగాడి నడుము మరో మగాడు గిల్లితే ఊరుకుంటారా…ఆ చెంప ఈ చెంప వాయించేయరా? అదే చేసాడు ఓ దర్శకుడు.
జస్ట్ ఈ మధ్యనే ఓ బర్త్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీకి చాలా మంది ఇండస్ట్రీ జనాలు వచ్చారు. పార్టీ మాంచి జోరుగా సాగుతోంది. పేరున్న దర్శకుడు, ఆ పార్టీకి కీలకమైన అతిధుల్లో ఒకరి నడుంను వున్నట్లుండి ఎవరో గిల్లారు. ఎవరా అని చూస్తే గతంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన ఓ పార్టిసిపెంట్.
పాపం అతగాడు ఈ డైరక్టర్ అనుకోలేదు. తన ఫ్రెండ్ అనుకుని ‘బ్యాక్’ చూసి గిల్లేసాడు. తీరా చేసి ఫేస్ చూసి.. సారీ అన్నాడు. కానీ ఈ లోగానే సదరు దర్శకుడికి కోపం నషాలానికి అంటింది. అంటదా మరి.. ఎవరో వచ్చి నడుం గిల్లితే. అందుకే ఫట్.. ఫట్.. మని ఆ లెంపా.. ఈ లెంపా వాయించేసాడట. అక్కడితో ఆగలేదు. చేతిలో వున్న గ్లాస్ లోని ద్రవాన్ని మొహం మీద విసిరేసాడు.
నిజానికి ఆ దర్శకుడికి కోపం రావడం చాలా అరదు. నవ్వుతూ, నవ్విస్తూ వుండే వ్యక్తి. నడుం గిల్లి అలాంటి వాడికి కూడా కోపం తెప్పించాడు ఆ బిగ్ బాస్ పార్టిసిపెంట్.