లవ్ స్టోరీ మొదటి రోజు వసూళ్లు

థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా? మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? ఆక్యుపెన్సీ సంగతేంటి? ఆంధ్రాలో టిక్కెట్ రేట్ల పరిస్థితేంటి? ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది లవ్ స్టోరీ. అడ్వాన్స్ బుకింగ్స్…

థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా? మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? ఆక్యుపెన్సీ సంగతేంటి? ఆంధ్రాలో టిక్కెట్ రేట్ల పరిస్థితేంటి? ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది లవ్ స్టోరీ. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సగం అనుమానాల్ని పటాపంచలు చేసిన ఈ సినిమా, మొదటి రోజు వసూళ్లతో వావ్ అనిపించింది. ఇండస్ట్రీకి ఓ కొత్త ఎనర్జీ ఇచ్చింది. పెద్ద సినిమాలకు ఓ దారి చూపించింది.

నిన్న రిలీజైన లవ్ స్టోరీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇదేం తక్కువ ఎమౌంట్ కాదు. ఓవర్సీస్ లో అయితే.. ఈ ఏడాది ప్రీమియర్స్ తో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది లవ్ స్టోరీ. 

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా 6 కోట్ల 80 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఒక్క నైజాం నుంచే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. సీడెడ్ నుంచి కోటికి పైగా షేర్ వచ్చింది. వెస్ట్, గుంటూరు ఏరియాల్లో, ఒక్కో సెగ్మెంట్ నుంచి అరకోటికి పైగా షేర్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్-మిలియన్ మార్క్ చేరుకుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా, నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. కమ్ముల నెరేషన్, నాగచైతన్య-సాయిపల్లవి మేజిక్, పవన్ మ్యూజిక్ ఈ సినిమాను హిట్ చేశాయి. క్లైమాక్స్ పై మిక్స్ డ్ టాక్ నడుస్తున్నప్పటికీ.. సినిమా రిజల్ట్, వసూళ్లపై అది పెద్దగా ప్రభావం చూపించదనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈరోజు కూడా హైదరాబాద్ తో సహా, తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్ లో హౌజ్ ఫుల్స్ నడుస్తున్నాయి.